నా కోచ్.. నాతోనే..

images (11)న్యూఢిల్లీ: తన కోచ్ విమల్ కుమార్ పేరును కూడా ఆసియా క్రీడల భారత బ్యాడ్మింటన్ బృందంలో చేర్చాలని సైనా నెహ్వాల్… భారత బ్యాడ్మింటన్ సంఘాన్ని (బాయ్) కోరింది. దీంతో విమల్‌ను కూడా కొరియా పంపించాలని బాయ్ నిర్ణయించింది. ప్రస్తుతం సైనా ఆసియా క్రీడల కోసం విమల్‌కుమార్ దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ”కొరియాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే కోచ్‌ల జాబితాలో విమల్‌కుమార్ పేరును చేర్చాలని సైనా కోరింది. ముందు ముగ్గురు కోచ్‌లను జట్టుతో (గోపీచంద్, మధుమిత బిస్త్, విజయ్‌దీప్‌సింగ్) పంపాలనుకున్నాం. ఇప్పుడు విమల్ పేరునూ చేర్చాం. పక్కపక్క కోర్టుల్లో ఒకేసారి మ్యాచ్‌లు జరిగేటప్పుడు అదనపు కోచ్ సేవలు ఉపయోగపడతాయి” అని బాయ్ అధికారి చెప్పాడు.

Leave a Comment