నటించే సమయం నాకు లేదు

Samanthaపరిస్థితులకు అనుగుణంగా మాట్లాడటం మన హీరోయిన్లకే తగునేమో. ఇది ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఇంతకు ముందు కథ, దర్శకుడే ముఖ్యం అన్న సమంత, హీరో ఎవరన్నది అస్సలు పట్టించుకోనన్నారు. అన్నట్లుగానే ఇటీవల ఒక టాలీవుడ్ చిత్రంలో నవ నటుడితో ఁఅల్లుడు శీనురూ. చిత్రంలో రొమాన్స్ చేశారు. ఆ చిత్రానికి కోటిన్నరకు పైనే పారితోషికం అందుకున్నట్టు వార్తల్లోకెక్కారు. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ రేంజే వేరు. కోలీవుడ్‌లో విజయ్, సూర్య, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు.
 
 దీంతో ఇకపై నూతన హీరోల సరసన నటించనని స్టేట్‌మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. టాలీవుడ్‌లో ఒక చిత్రంలో కొత్త హీరో సరసన నటించడంతో ఆ తరువాత అలాంటి అవకాశాలు చాలా వస్తున్నాయట. పారితోషికం కూడా భారీగా ముట్ట జెబుతామని ఆశ చూపుతున్నారట. అలా పారితోషికానికి  ఆశపడి ఆ చిత్రాలను అంగీకరిస్తే తన మార్కెట్‌కు భంగం కలుగుతుందని భయపడ్డ సమంత నవ హీరోలకూ నో అంటున్నారని సమాచారం. నూతన నటులతో నటించే సమయం తనకు లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారట. ప్రస్తుతం సమంత సూర్యతో జత కట్టిన అంజాన్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఆ తరువాత విజయ్‌తో నటించిన కత్తి విడుదల కానుంది.  

Leave a Comment