‘ఆసియా క్రీడలపై ఐటాదే నిర్ణయం’

download (6)హౖదరాబాద్: ఆసియా క్రీడల్లో తాను పాల్గొనాలా వద్దా అన్న నిర్ణయాన్ని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా)కు వదిలేసినట్లు సానియా మీర్జా తెలిపింది. ”ఆసియా క్రీడల సమయంలోనే బీజింగ్, టోక్యో వంటి పెద్ద టోర్నీలున్నాయి. వీటిలో ఆడకపోతే ఏడాది ఆఖర్లో జరిగే డబ్ల్యూటీఏ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించడం కష్టమవుతుంది. ఇదో క్లిష్టమైన పరిస్థితి. అయినా దేశం కోసం ఆసియా క్రీడల్లో ఆడేందుకు సిద్ధం. ఈ నిర్ణయాన్ని సొంతంగా తీసుకోలేను. కాబట్టే ఐటాకు వదిలేశా”నని సానియా తెలిపింది.
సీఎం కేసీఆర్ సహకారం వల్లే టైటిల్ సాధించా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహకారం వల్లే యూఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ సాధించగలిగానని సానియా తెలిపింది. ఆదివారం హైదరాబాద్ తిరిగొచ్చిన సానియాకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ హోదాలో యూఎస్ ఓపెన్‌లో పాల్గొని టైటిల్ గెలుచుకుని రావడం పట్ల సానియా సంతోషం వ్యక్తంజేసింది. యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా మీర్జాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఆదివారం అభినందించారు. ”మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో గెలిచినందుకు సానియా మీర్జాకు అభినందనలు. ఆమె టైటిల్ మనకు గర్వకారణం” అని ప్రధాని అన్నారు.

Leave a Comment