నేనక్కడ.. నువ్విక్కడ

images (6)హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల పెళ్ళైన దగ్గరి నుంచి ఇద్దరికీ తీరిక లేదు. తమ కెరీర్‌లకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న వీరిద్దరు వివిధ టోర్నీల కోసం విదేశాల్లో అధికంగా గడుపుతున్నారు. దీంతో ఏడాదిలో వీరిద్దరూ కలిసుంది కొన్నిరోజులే. అటు షోయబ్ ఇంటికి.. ఇటు సానియా ఇంటికి ఇద్దరు కలిసి వెళ్ళేది చాలా అరుదు. ఛాంపియన్స్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న షోయబ్ చాలాకాలం తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ఐతే సానియా మాత్రం నగరంలో లేదు. టోక్యోలో జరుగుతున్న పాన్ పసిఫిక్ ఓపెన్‌లో సానియా ఆడుతుంది. ”షోయబ్ హైదరాబాద్‌లో ఉన్నాడు.. నేనేమో టోక్యోలో! ప్చ్” అంటూ సానియా ట్వీట్ చేసింది. సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా శంషాబాద్ విమానాశ్రయంలో షోయబ్‌కు స్వాగతం పలికాడు. అనంతరం షోయబ్ జట్టుతో పాటు హోటల్‌కు వెళ్ళాడు. జట్టు మేనేజ్‌మెంట్ అనుమతితో శుక్రవారం రాత్రి సానియా ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో షోయబ్ పాల్గొన్నాడు

Leave a Comment