ప్రధాని మోడి జ్ఞాపకశక్తి అద్భుతం

images (8)హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడిని కలవడం గొప్ప అనుభూతినిచ్చిందని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. తన అకాడమీ గురించి మోడి ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారని చెప్పింది. యుఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా.. శుక్రవారం ప్రధానిని కలిసిన సంగతి తెలిసిందే. ప్రధాని నుంచి ఆహ్వానం అందడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని టోర్నీ కోసం టోక్యో (జపాన్) వెళ్ళేముందు సానియా ‘ఈనాడు’తో తెలిపింది. ”ప్రధానిని కలవడం గొప్ప అనుభూతి. యుఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచాక నాకు అభినందన సందేశం పంపారు. అందుకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపా. మోడి జ్ఞాపకశక్తి అద్భుతం. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం చెల్లి ఆనమ్ అహ్మదాబాద్‌లో షూటింగ్ పోటీల్లో పాల్గొన్నపుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడిని కలిసింది. ఆనమ్‌ను ఇప్పటికీ ఆయన గుర్తు పెట్టుకున్నారు. తన గురించి వాకబు చేశారు” అని సానియా చెప్పింది. ”తీరికలేని షెడ్యూల్‌లోనూ ప్రధాని నాకు సమయమివ్వడం గొప్పగా అనిపిస్తుంది. ఆయన చాలా సావధానంగా నాతో మాట్లాడారు. టైటిల్ గెలిచినందుకు అభినందించారు” అని వివరించింది.

Leave a Comment