హౖదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు అవసరమైన సాయం అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు.యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా మంగళవారం సీఎం అధికార నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసింది. మీ ప్రోత్సాహం వల్లే టైటిల్ గెలిచానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో సానియా చెప్పింది. సానియాను అభినందించిన సీఎం.. ఆమె సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. భవిష్యత్తులో సానియా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం అందిస్తామని వెల్లడించారు. తన విజయాన్ని తెలంగాణ ప్రజలకు, భారత ప్రజలకు అంకితమిస్తున్నట్లు సానియా ప్రకటించడాన్ని సీఎం అభినందించారు. త్వరలో ప్రభుత్వం తరఫున సానియాను సన్మానించనున్నారు.
Recent Comments