భారత పతాకధారి సర్దార్ సింగ్

images (5)ఇంచియాన్: ఆసియా క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా భారత బృందానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. హాకీ కెప్టెన్ సర్దార్‌సింగ్ భారత పతాకాన్ని చేబూననున్నాడు.
తొలి రోజు వేడుకలే: శుక్రవారం ఆసియా క్రీడల తొలి రోజు కేవలం ఆరంభోత్సవం మాత్రమే ఉంటుంది. పోటీలు శనివారం మొదలవుతాయి. అక్టోబరు 4న క్రీడలకు తెరపడుతుంది. ఆసియా క్రీడల్ని భారత్‌లో టెన్‌స్పోర్ట్స్ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. భారత కాలమానం ప్రకారం రోజూ ఉదయం 5.30 గంటలకు పోటీలు ఆరంభమవుతాయి.

Leave a Comment