చవాన్ విషయంలో జోక్యం చేసుకోం: సుప్రీం

81390040648_625x300 (1)న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు ఎన్నికల సంఘం(ఈసీ) ఆయనకు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన వ్యహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 15 రోజుల్లో ఈ వ్యవహారం తేల్చాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. చట్టప్రకారమే ఈ విషయంలో హైకోర్టు ముందుకెళుతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.        

బీజేపీ నాయకులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కిరిట్ సోమయ్యలతో పాటు మరో స్వతంత్ర సభ్యుడు చవాన్ వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.