సెన్సెక్స్ రికార్డు ముగింపు!

images (1)భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో పరుగులు పెట్టాయి.  గత కొద్ది రోజులుగా బుల్ రన్ కొనసాగిస్తున్న  ప్రధాన సూచీలు సోమవారం రోజున భారీగా లాభపడటమే కాకుండా.. జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి.
సెన్సెక్స్ 229 పాయింట్లతో 26987 పాయింట్ల వద్ద, నిఫ్టీ 73 పాయింట్లతో 8027 పాయింట్ల వద్ద ముగిసాయి. జిందాల్ స్టీల్ అత్యధికంగా 6.44 శాతం లాభపడగా, హీరో మోటో కార్ప్, మారుతి సుజుకి, టాటా పవర్, గెయిల్ కంపెనీలు 4శాతానికి పైగా లాభపడ్డాయి. సన్ ఫార్మ, హెచ్ డీఎఫ్ సీ, ఐటీసీ, భెల్, టాటా మోటార్స్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి.