నష్టాలతో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ!

download (3)హైదరాబాద్: రియాల్టీ, కాపిటల్ గూడ్స్, ఇన్ ఫ్రా, ఆయిల్, గ్యాస్ రంగాల కంపెనీల షేర్లలో అమ్మకాలు జరగడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ ఒడిగట్టడం, ఆసియా మార్కెట్లలో ప్రతికూల స్పందన, వివిధ అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 99 పాయింట్ల నష్టంతో 27040 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు క్షీణించి 8079 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
లుపిన్, సిప్లా, హెచ్ యూఎల్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, డీఎల్ఎఫ్ అత్యధికంగా 7 శాతానికి పైగా నష్టపోగా, జిందాల్ స్టీల్, భెల్, హిండాల్కో, పీఎన్ బీ కంపెనీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Leave a Comment