బెంగాల్ ఆస్పత్రిలో ఏడుగురు చిన్నారుల మృతి

infant deathsకోల్కతా : పశ్చిమబెంగాల్లోని మాల్డా వైద్య కళాశాల ఆస్పత్రిలో ఏడుగురు చిన్నారులు మరణించారు. వీరంతా తక్కువ బరువుతో పుట్టారని, ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే వాళ్లందరి ఆరోగ్యం చాలా విషమించిందని మెడికల్ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపల్ ఎంఏ రషీద్ తెలిపారు.

ఇటీవలి కాలంలో కూడా ఈ ప్రభుత్వాస్పత్రిలో తరచు చిన్నారులు మరణించిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జూన్ నెలలో మెదడువాపు కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోగా, జనవరిలో డజను మందికి పైగా పిల్లలు అంతుతెలియని వ్యాధితో మరణించారు.

Leave a Comment