ఢిల్లీలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనలేదు

images (7)న్యూఢిల్లీ: ఢిల్లీలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాను ఎన్నడూ చెప్పలేదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. తగిన సంఖ్యాబలం ఉంటే భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాత్రమే తాను అన్నానని తెలిపారు. ”ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలు మంచివి. ఎందుకంటే అవి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో భాజపా ఉంటే, అది ఢిల్లీకి మంచిదే” అని ఆమె అప్పుడు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై షీలా శనివారం వివరణ ఇచ్చారు. కేరళ గవర్నర్ పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా తనపై ఎన్‌డీఏ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని షీలా విమర్శించారు. ఒక అధికారి తనకు ఫోన్ చేసి, పదవికి రాజీనామా చేయాలని చెప్పారని, ఇది సరికాదని తప్పుబట్టారు.

Leave a Comment