మళ్లీ పెళ్లి చేసుకున్న షోయబ్ అక్తర్

shoaib akhtarఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరో ఇంటివాడయ్యాడు. అవును.. ఖైబర్ ఫక్తుంఖ్వా రాష్ట్రంలోని హరిపూర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల అమ్మాయిని షోయబ్ నిఖా చేసుకున్నాడు. రుబాబ్ అనే ఈ అమ్మాయితో అత్యంత రహస్యంగా హరిపూర్లోనే అక్తర్ నిఖా అయ్యిందన్న విషయాన్ని పాకిస్థాన్కు చెందిన దునియా టీవీ వెల్లడించింది. హక్ మహర్ కింద ఐదు లక్షల రూపాయలు చెల్లించారని, అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లికి అక్తర్ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారని ఆ టీవీ చెప్పింది.

వాస్తవానికి అక్తర్ తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు తొలుత కథనాలు వచ్చినా, వాటన్నింటినీ ట్విట్టర్ ద్వారా తీవ్రంగా ఖండించాడు. కానీ ఈనెల 12వ తేదీన అక్తర్ కుటుంబం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి, పెళ్లి విషయాన్ని ఖరారు చేసుకుందని అక్తర్కు సన్నిహిత వర్గాలు పీటీఐకి తెలిపాయి.

Leave a Comment