న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శుక్రవారం 68వ స్వాతంత్య్ర దిన వేడుకలు ప్రశాంతంగా, ఘనంగా జరిగాయి. విదేశాల్లోనూ భారతీయాభిమానం వెల్లివిరిసింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీనియర్ నేతలు ఆంటోనీ, గులాంనబీ ఆజాద్, అహ్మద్‌పటేల్, జనార్దన్‌ద్వివేది, షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
Recent Comments