శ్రీలంకతో తొలి టెస్ట్: పాక్ భారీ స్కోరు

61407442492_625x300 (1)గాలే: సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ (331 బంతుల్లో 177; 15 ఫోర్లు; 1 సిక్స్) అద్భుత ఆటతీరుతో… శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ మెరుగైన స్థితిలో నిలిచింది. గాలె అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మిస్బా సేన 140.5 ఓవర్లలో 451 పరుగుల భారీ స్కోరు చేసి అలౌటైంది.

261/4 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట ప్రారంభించిన పాక్ ఇన్నింగ్స్‌లో అసద్ షఫీఖ్ (147 బంతుల్లో 75; 8 ఫోర్లు; 2 సిక్సర్లు), సర్ఫరాజ్ అహ్మద్ (71 బంతుల్లో 55; 6 ఫోర్లు), అబ్దుర్ రహమాన్ (61 బంతుల్లో 50; 6 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగారు.  లంక బౌలర్లలో దిల్‌రువానా పెరీరాకు ఐదు, హెరాత్‌కు మూడు, ప్రసాద్‌కు రెండు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లంక 34 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది.  సిల్వ (94 బంతుల్లో 38 బ్యాటింగ్; 7 ఫోర్లు), సంగక్కర (95 బంతుల్లో 36 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.