ఆరంభం నుంచే అదరగొట్టాలి

imagesహైదరాబాద్: ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 టోర్నీలో ఆరంభం నుంచి అదరగొట్టాల్సిందేనని కోల్‌కత నైట్‌రైడర్స్ సారథి గౌతం గంభీర్ అన్నాడు. ఐపీఎల్‌తో పోల్చుకుంటే ఇది చాలా చిన్న టోర్నీ అయినా భిన్నమైన సవాల్ అని చెప్పాడు. ఆదివారం విలేకరుల సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ.. ”ఛాంపియన్స్ లీగ్‌ను ఇప్పటివరకు మేం గెలవలేదు. ఈసారి మరింత స్ఫూర్తిమంతంగా ఆడి ఛాంపియన్స్‌గా నిలవాలని పట్టుదలగా ఉన్నాం. ఐపీఎల్ ఆరంభంలో మేం బాగా ఆడలేదు. అయినా విజేతగా నిలిచాం. ఈ టోర్నీలో ఆరంభంలో సత్తాచాటితే భుజలపై ఉన్న భారమంతా దిగిపోతుంది. ఏదో జరుగుతుందని ఎదురుచూడటం అనవసరం. 17వ తేదీ చూడండి… ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ అయినా.. మరో జట్త్టెనా అత్యుత్తమ క్రికెట్ ఆడి పైచేయి సాధిస్తాం” అని తెలిపాడు.

Leave a Comment