సుభాష్ చంద్రబోస్ కారు కనిపించింది!!

51406367154_625x300ధన్‌బాద్ : భారత స్వతంత్ర సేనాని సుభాష్ చంద్రబోస్ ఉపయోగించిన కారు జార్ఖండ్‌లో కనిపించింది. దాదాపు 90 ఏళ్లనాటి ఈ బేబీ ఆస్టిన్ కారులోనే సుభాష్ చంద్రబోస్ 1930 నుంచి 1941 వరకు జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో తిరిగారు. ఇప్పుడది ధన్‌బాద్‌లోని బరారీ కోక్ ప్లాంటు గోడౌన్లో కనిపించింది.

వెంటనే ఈ కారును తమకు అప్పగించాలని భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ సీఎండీ తపస్ కుమార్ లాహిరి ఆ జనరల్ మేనేజర్‌ను కోరారు. తర్వాత ఆ కారును కోల్ మేనేజర్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. అనంతరం బీసీసీఎల్ సంస్థ ఈ కారు గురించి కోల్‌కతాలోని నేతాజీ రీసెర్చ్ బ్యూరోకు తెలిపింది. ఈ కారును సుభాష్ చంద్రబోస్ మేనమామ అశోక్ బోస్ ఉపయోగించేవారని సమాచారం.

Leave a Comment