ఎమ్మెల్యేలు ఇళ్లలో ఎందుకుండాలి?

41387574512_625x300న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఎందుకుంచారంటూ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇళ్లలో ఎందుకుండాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఢిల్లీలో రాజకీయ అనిశ్చితిని తొలగించాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. కాంగ్రెస్తో విభేదించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచారు. అసెంబ్లీలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా చతికిలపడగా, బీజేపీ, ఆప్కు తగిన మెజార్జీ రాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు రాగా, ఆప్ మాత్రం మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.