స్టయిలిష్ డాన్‌తో రొమాన్స్

81407693971_625x300మాస్‌కి కావాల్సిన వీరత్వం… క్లాస్ ప్రేక్షకులకు కావాల్సిన భిన్నత్వం… రెండూ సూర్యలో ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నారాయన. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ‘సికిందర్’ చిత్రంతో మరోమారు భిన్నంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు సూర్య. లగడపాటి శిరీషా-శ్రీధర్, తిరుపతి బ్రదర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఆగస్ట్ 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ  సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘సూర్య స్టయిలిష్ డాన్‌గా ఇందులో కనిపించనున్నారు. గొప్ప కథాంశంతో లింగుస్వామి చిత్రాన్ని మలిచారు. యువన్‌శంకర్‌రాజా స్వరాలకు స్పందన బాగుంది. అందం, అభినయం కలబోతగా ఇందులో సమంత పాత్ర ఉంటుంది. పదేళ్లు పూర్తి చేసుకున్న మా రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ సంస్థకు ఓ మైలురాయిలా నిలిచే సినిమా అవుతుంది’’ అని చెప్పారు.