నేడు ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశం

81377500751_625x300నేపితా: మయన్మార్‌లో శనివారం జరిగే ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశంగా మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ శుక్రవారం మయన్మార్ రాజధాని నేపితా చేరుకున్నారు. ఆసియాన్ దేశాలతో వాణిజ్యం, పెట్టుబడులు, సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఆమె చర్చలు జరపనున్నారు. నాలుగు రోజుల పర్యటనలో ఆమె పలు కీలక సమావేశాల్లో పాలుపంచుకోనున్నారు.
 
ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంతోపాటు తూర్పు ఆసియా సదస్సు, ఆసియన్ రీజినల్ ఫోరమ్ సదస్సుల్లో సుష్మా స్వరాజ్ పాల్గొంటారు. అలాగే చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.