హర్యానా ఎన్నికల బరిలో సుష్మాస్వరాజ్ సోదరి

images (8)న్యూఢిల్లీ: హర్యానా శాసనసభ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసే అభ్యర్థుల తుదివిడత జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం (సి.ఇ.సి.) శనివారం రాత్రి ఖరారు చేసింది. మొత్తం 47 స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాగా వారిలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సోదరి వందనా శర్మ (సఫిడాన్ నియోజకవర్గం) ఒకరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జరిగిన సి.ఇ.సి. సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షత వహించారు. 90 స్థానాలున్న శాసనసభకు అక్టోబరు 15న ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, గుజరాత్‌లలో జరిగే ఉప ఎన్నికలకు కూడా సి.ఇ.సి. సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేశారు.

Leave a Comment