అంబటి రాంబాబు కారుపై దాడి

ambati rambabuగుంటూరు: అధికార టీడీపీ కార్యకర్తలు గుంటూరు జిల్లాలో రెచ్చిపోయారు. ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో స్వైర విహారం చేశారు. ఎంపీటీసీ సభ్యులతో వెళుతున్న వైఎస్ఆర్ సీపీ నాయకుడు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా వాహనాలను మేడికొండూరు వద్ద అడ్డుకుని దాడులకు పాల్పడ్డారు.

ఈ ఉదయం నుంచి కాపుకాసిన దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ముగ్గురు ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మల్యే ముస్తాఫాకు స్వల్ప గాయాలయ్యాయి.

Leave a Comment