షిరోవ్‌ను ఓడించిన భారత టీనేజర్

Aravindh-Chithambaram_Firstరిగా (లాట్వియా): భారత టీనేజి చెస్ ఆటగాడు అరవింద్ చితంబరం తన కెరీర్‌లోనే అతి భారీ విజయాన్ని సాధించాడు. 2000లో ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం విశ్వనాథన్ ఆనంద్‌తో పోటీపడి ఓడిన అలెక్సీ షిరోవ్‌ను ఈ 15 ఏళ్ల చెన్నై చిచ్చర పిడుగు కంగుతినిపించాడు. రిగా టెక్నికల్ యూనివర్సిటీ ఓపెన్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో షిరోవ్‌పై అరవింద్ పూర్తి ఆధిక్యం ప్రదర్శించి సత్తా చాటాడు. ఈ టైటిల్‌ను అర్మేనియాకు చెందిన మెల్కుమ్యాన్ (7.5 పాయింట్లు) దక్కించుకున్నాడు.