కోనేరు హంపి పెళ్లికూతురాయె

41407914743_625x300విజయవాడ: చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పెళ్లి కూతురైంది. ఈ రోజు రాత్రి హంపి వివాహం.. ఎఫ్ట్రానిక్స్ మేనేజింగ్ డెరైక్టర్ దాసరి రామకృష్ణ తనయుడు అన్వేష్‌తో జరగనుంది. బుధవారం ఉదయం హంపిని పెళ్లి కూతురిగా ముస్తాబు చేశారు. తెలుగుతనం, సాంప్రదాయం ఉట్టిపడేలా హంపి పట్టు చీరలో మెరిసిపోయింది. హంపి కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

హంపి, అన్వేష్లకు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. విజయవాడలో వివాహ వేదిక ‘ఏ కన్వెన్షన్ సెంటర్’ను అందంగా అలంకరించారు. ఇరువురి కుటుంబ సభ్యుల పెద్దలు ఈ పెళ్లిని నిశ్చయించారు. హంపి వివాహానికి పలువురు వీఐపీలు హాజరయ్యే అవకాశముంది.