అమెరికా విమాన టికెట్.. లక్షకు పైమాటే!!

41407780536_625x300న్యూఢిల్లీ : అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? అయితే కొన్నాళ్లు ఆగండి. ఎందుకంటే, ఇప్పుడు అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరలన్నీ మండిపోతున్నాయి. మామూలుగా అయితే ఎకానమీ క్లాస్ టికెట్ల ధర సుమారుగా 48 వేల రూపాయలు ఉంటుంది. అలాంటిది ఇప్పుడు 97 వేల వరకు ఉంది. న్యూయార్క్, చికాగో లాంటి నగరాలకు భారతదేశం నుంచి టికెట్లు రూ. 90 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు పలుకుతోంది.

న్యూజెర్సీలో స్వామి నారాయణ్ మహోత్సవం జరుగుతోందని, దానికితోడు అక్కడ సెలవులు కూడా ఉన్నాయని, అలాగే అక్కడ కొత్త సెమిస్టర్లు మొదలవుతాయని, అందుకే ఇంత ఎక్కువ ధరలు పలుకుతున్నాయని ట్రావెల్ ఏజెంట్లు అంటున్నారు. స్వామి నారాయణ్ భక్తులు వేలాది సంఖ్యలో న్యూజెర్సీకి వెళ్లి, అక్కడ నిర్మిస్తున్న అతిపెద్ద అక్షర్ధామ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. దాంతో ఒక్కసారిగా అన్ని విమానయాన సంస్థల ఎకానమీ క్లాస్ టికెట్ల ధరలు రూ. 80 వేల నుంచి లక్ష వరకు పలుకుతున్నాయి