రైల్వే వ్యవస్థను నాశనం చేశారు:వెంకయ్య

imagesవిజయవాడ: గత ప్రభుత్వం రైల్వే వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. రైల్వే వ్యవస్థను కాపాడేందుకు చార్జీలు పెంచడానికి యూపీఏ ప్రభుత్వ విదానాలే కారణమని మండిపడ్డారు. శుక్రవారం దేశానికి వెన్నుముక అయిన రైల్వే వ్యవస్థపై యూపీఏ ప్రభుత్వం అవలంభించిన తీరును వెంకయ్య తప్పుబట్టారు. ఆ ప్రభుత్వం రైల్వేను నాశనం చేయడం వల్లే ఈ రోజు ఆ వ్యవస్థను కాపాడేందుకు ఛార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు.
 
పార్లమెంట్ లో కమ్యూనిస్టుల ఉనికి ఏమైనా ఉందా?అని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దేశంలో సంపద సృష్టించి, అభివృద్ధి చేయగల సత్తా మోడీకే ఉందని వెంకయ్య తెలిపారు.