మూవీ బజ్.. హాలీవుడ్‌లో ‘కహానీ’

41406318207_625x300సుజయ్ ఘోష్ దర్శకత్వంలో యశ్‌చోప్రా  ఫిలిమ్స్ రెండేళ్ల కిందట విద్యాబాలన్  హీరోయిన్‌గా రూపొందించిన ‘కహానీ’  చిత్రానికి హాలీవుడ్ రీమేక్ త్వరలోనే  తెరకెక్కనుంది. ‘డైటీ’ పేరిట రీమేక్  చేయనున్న ఈ చిత్రానికి నీల్స్ ఆర్డెన్ ఓప్లెవ్ దర్శకత్వం వహించనున్నాడు. జోస్ రివెరా, రిచర్డ్ రీగన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించనున్నారు.
 ‘బ్యాంక్ చోర్’లో రియా చక్రవర్తి
 రితేష్ దేశ్‌ముఖ్ హీరోగా తెరకెక్కుతున్న ‘బ్యాంక్‌చోర్’ చిత్రంలో బెంగాలీ భామ రియా చక్రవర్తి హీరోయిన్ పాత్ర పోషించనుంది. ఎంటీవీలో అతి పిన్నవయస్కురాలైన వీజేగా కెరీర్ ప్రారంభించిన రియా… ‘మేరే డాడ్ కీ మారుతి’తో తెరంగేట్రం చేసింది. ఇప్పటికే ఆమె నటించిన ‘బాబూకీ జవానీ’, ‘సోనాలీ కేబుల్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వరుస చిత్రాలతో ఈ బెంగాలీ భామ బాలీవుడ్‌ను ఊపేయగలదని సినీవర్గాల అంచనా.
ఇండస్ట్రీలో దోస్త్ నహీ
ఫిలిం ఇండస్ట్రీలో దోస్తీలు ఉంటాయే గానీ, దోస్తులు ఉండరని కమేడియన్ జానీ లీవర్ తన అనుభవసారాన్ని మీడియాతో పంచుకున్నాడు. తెలుగువాడైన జానీ లీవర్‌ది బాలీవుడ్‌లో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’. ఇండస్ట్రీలో స్నేహితులెవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తే, ‘షూటింగ్‌లో కలుసుకునేటప్పుడు అందరూ దోస్తీగానే ఉంటారు. సాయం కావాలంటే అర్ధరాత్రి వేళలోనైనా నిస్సంకోచంగా కాల్ చేయవచ్చని చెబుతారు. నిజంగా ఎవరికైనా కాల్ చేస్తే, అర్ధరాత్రి కాల్ చేయమన్నా కదా! పొద్దున్నే ఎందుకు చేశావని ప్రశ్నిస్తారు’ అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు.

Leave a Comment