విరాట్ కోహ్లీ రహస్య డిన్నర్…!

71388264954_625x300సాతాంప్టన్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత డాషింగ్ బాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ డిన్నర్ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ లోని బ్రెజిలియన్ రెస్టారెంట్ లో మంగళవారం రాత్రి విందు ఆరగించారని బీబీసీ రేడియో ఓ కథనాన్ని వెల్లడించింది.
అయితే డిన్నర్ వ్యవహారంపై అటు వాన్, ఇటు కోహ్లీల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో మరింత ఆసక్తిని రేపుతోంది. వారిద్దరి మధ్య ఇలాంటి చర్చలు జరిగాయనే అంశంపై ఊహాజనిత కథనాలు వస్తున్నాయి. క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో దుమ్ము దులిపేస్తున్న కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనలో ఆశించిన మేరకు రాణించలేకపోయాడు.
 ఇంగ్లీష్ పిచ్ లపై స్వింగ్ బౌలింగ్ ఎదుర్కొనలేక ఇబ్బందపడుతున్న కోహ్లీ తన వైఫల్యాలను అధిగమించడానికి మాజీ కెప్టెన్ వాన్ తో ఏమైనా టిప్స్ తీసుకున్నాడా అనే కోణంలో కూడా క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Leave a Comment