కదిలే.. అదిరే..

Conveyor Bridgeప్రపంచంలోని కదిలే యంత్రాల్లో ఇదే అత్యంత పెద్దది. ‘ఎఫ్60’ అనే ఈ కన్వేయర్ బ్రిడ్జిని జర్మనీలోని లుసాటియన్‌లో బొగ్గు గనుల్లో వినియోగించడం కోసం 1991లో రూపొందించారు. ఏకంగా అరకిలోమీటరుకు పైగా పొడవున్న దీని బరువు ఎంతో తెలుసా? 13,600 టన్నులు. ముందువైపు, వెనుకవైపు రెండు బోగీలపై ఆధారపడి ఇది కదులుతుంది.

ఈ బోగీలు ఒక్కోదానికి 760 చక్రాలుంటాయి. 502 మీటర్ల పొడవు, 80 మీటర్ల ఎత్తు, 240 మీటర్ల వెడల్పు కలిగిన ఈ కన్వేయర్ బ్రిడ్జి గరిష్ట వేగం నిమిషానికి 13 మీటర్లు మాత్రమే. 1991 మార్చిలో ప్రారంభమైన ఈ ఎఫ్60.. 1992 జూన్‌లో నిలిచిపోయింది.

Leave a Comment