రాకెట్ వెల్డింగ్ కేంద్రం…

download (1)వాషింగ్టన్:ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ వెల్డింగ్ కేంద్రమిది. అమెరికాలోని న్యూ ఆర్లాన్స్‌లో గల మికౌడ్ రాకెట్ అనుసంధాన కేంద్రంలో ఏర్పాటుచేసిన ఈ ‘వర్టికల్ అసెంబ్లీ సెంటర్(వాక్)’ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శుక్రవారం ఆవిష్కరించింది.

170 అడుగుల ఎత్తు, 78 అడుగుల వెడల్పుతో ఉన్న వాక్‌లో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, త ర్వాతి తరం అమెరికా రాకెట్ అయిన ‘స్పేస్ లాంచ్ సిస్టమ్(ఎస్‌ఎల్‌ఎస్)’కు వెల్డింగ్, అనుసంధానం పనులు చేయనున్నారు. రాకెట్‌లో వివిధ దశలను అనుసంధానం చేయడంతో పాటు ఇంధన ట్యాంకులు, డోమ్‌లు, ఇతర నిర్మాణాల పటిష్టతను కూడా ఇందులో పరీక్షించనున్నారు.

Leave a Comment