ఆ ప్రశ్నలకు చిరంజీవి సమాధానం చెబుతారా?

81407397088_625x300ప్రత్యక్ష రాజకీయాల నుంచి కొంత బ్రేక్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 150వ చిత్రం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కథా చర్చలతోపాటు, ఇతర అంశాలపై దృష్టిపెట్టిన చిరంజీవి తన అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు. అయితే వెండితెర మీద కంటే ముందుగా అక్కినేని నాగార్జున ప్రారంభించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు చిరంజీవి పచ్చ జెండా ఊపారు.
ఇప్పటికే ఎందరో నటీనటులను కోటీశ్వరుడు కార్యక్రమం ద్వారా నాగార్జున అభిమానులకు దగ్గరకు చేర్చిన సంగతి తెలిసిందే. కోటీశ్వరుడు కార్యక్రమం 40 ఎపిసోడ్ లో పాల్గొనేందుకు మెగాస్టార్ ను ప్రత్యేక అతిధిగా ఆహ్వానించారు. చిరంజీవితో ‘కోటీశ్వరుడు’ కార్యక్రమం గురువారం ఆగస్టు 7 తేదిన రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కార్యక్రమం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
కోటీశ్వరుడు కార్యక్రమంలో నాగార్జున అడిగే ప్రశ్నలకు చిరంజీవి ఎలా సమాధానాలిస్తారోనని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ప్రశ్నలు, చిరంజీవి సమాధానాలు అభిమానుల్లో ఏ రేంజ్ లో సంతోషాన్ని నింపుతాయనే విషయాన్ని తెలుసుకోవాలంటే అనేది కొద్ది గంటలు ఆగితే తెలుస్తుంది.