నాన్నతో నటిస్తా

actress-shruthi-hassan-hot-stills-52నాన్న (కమలహాసన్)తో ఖచ్చితంగా నటిస్తానంటున్నారు శ్రుతిహాసన్. ప్రస్తుతం నటిగా ఈ బ్యూటీ స్థాయి ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో నెంబర్‌వన్ రేస్‌లో ఉన్న శ్రుతి కోలీవుడ్‌లో విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.

పస్తుతం తమిళంలో విశాల్ సరసన పూజై చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ఇళయదళపతి విజయ్‌తో జోడీకి సిద్ధమవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ తనతండ్రి కమల్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన విశ్వరూపం-2 చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ చేయూలని స్వయంగా కమలహాసన్ కోరగా నిరాకరించినట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. శ్రుతి ఇప్పటికే అంగీకరించిన చిత్రాలతో బిజీగా ఉండడం వలన ఆమె తన తండ్రికి నో చెప్పినట్లు సమాచారం.

అయితే ఈ ప్రచారాన్ని శ్రుతిహాసన్ ఖండించారు. అదంతా అసత్య ప్రచారంగా కొట్టి పారేశారు. నిజానికి విశ్వరూపం-2 చిత్రంలో సింగిల్ సాంగ్‌కు నటించాలని తన తండ్రి అడగలేదన్నారు. అయితే భవిష్యత్తులో తన తండ్రితో కలిసి కచ్చితంగా నటిస్తానని శ్రుతిహాసన్ వెల్లడించారు. అలాంటి మంచి కథ అమరాలన్నారు. తనతండ్రి నటించిన విశ్వరూపం-2 చాలా ఉత్తమ చిత్రంగాఉంటుందనే నమ్మకాన్ని శ్రుతి వ్యక్తం చేశారు.

Leave a Comment