తుపాకీతో బెదిరించి యువతిపై గ్యాంగ్ రేప్

51405375482_625x300న్యూఢిల్లీ: ఓ యువతిని నలుగురు యువకులు అడ్డగించి… తుపాకితో బెదిరించి… కారులో ఎక్కించుకుని ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను వద్ద ఉన్న రూ. 5 వేల నగదును నిందితులు దోచుకుని పరారైయ్యారు. ఆ సంఘటన దేశ రాజధాని హస్తినలోని 8వ నెంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు న్యూఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది.

దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని మధుర నగరం బాధితురాలి స్వస్థలమని చెప్పారు. ఇటీవలే న్యూఢిల్లీలోని గుర్గావ్ వచ్చిన ఆమె తిరిగి స్వస్థలం వెళ్లే క్రమంలో సామూహిక అత్యాచారానికి గురైందని తెలిపారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Comment