ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్ పెట్టి ..ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

51406837308_625x300హైదరాబాద్: కళాశాల వైస్‌ప్రిన్సిపల్ బెదిరింపుతో ఇంటర్‌విద్యార్థి ఒకరు ఫేస్‌బుక్‌లో సూసైడ్‌నోట్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మియాపూర్‌కు చెందిన వై.ఇంద్రశేఖర్ అడ్డగుట్ట సొసైటీలోని నారాయణ ఐఐటీ క్యాంపస్‌లో ఇంటర్ ద్వితీయసంవత్సరం చదువుతున్నాడు. నాలుగురోజుల కిందట కళాశాలలోని క్లాస్‌రూంలో ఇంద్రశేఖర్‌తో పాటు మరోవిద్యార్థిని వద్ద ఉన్న సెల్‌ఫోన్లను వైస్ ప్రిన్సిపల్ రవి స్వాధీనం చేసుకున్నారు.
 
వారు ఇరువురు ప్రేమించుకుంటునట్లు ఫోన్‌లోని మెసేజ్‌ల ద్వారా గుర్తించారు. విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు టి.సి. ఇచ్చి పంపిస్తానని ఇంద్రశేఖర్‌ను బెదిరించారు. దీంతో భయపడిన చంద్రశేఖర్ రెండు రోజులు నుంచి కాలేజీకి వెళ్లలేదు. గురువారం ఉదయం తన చావుకు వైస్ ప్రిన్సిపల్ రవి కారణమని ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్ పోస్టు చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి నాయకులు కాలేజీ ముందు ధర్నాకు దిగారు. వైస్ ప్రిన్సిపల్ వల్లే తమ స్నేహిడుతు సూసైడ్ చేసుకున్నాడని ఇంద్రశేఖర్ మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, వైస్ ప్రిన్సిపల్ రవిపై కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ సంతోష్ తెలిపారు.

Leave a Comment