భాగ్యనగరంలో మరో గ్యాంగ్ రేప్

imagesహైదరాబాద్: భాగ్యనగరంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పహాడీ షరీఫ్ లో ‘స్నేక్ గ్యాంగ్’ దారుణోదంతం మరవకముందే మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోమరో గ్యాంగ్ రేప్ వెలుగులోకి వచ్చింది. ఓ యువతిపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం గురించి తెలిసింది. ఎల్బీనగర్‌ నుంచి ఘట్‌కేసర్‌ వెళ్తున్న తనపై ఆటో డ్రైవర్‌తోపాటు ఐదుగురు అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.